సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ సమయంలో ఏదైనా విపత్తులు, ఇళ్లు కూలిపోయే ప్రమాదాలు ఉంటాయన్నారు. ఏమైనా సమస్యలు, విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే సమాచారం అందించేందుకు మెదక్ కలెక్టరేట్లో […]