సారథి న్యూస్, మహబూబాబాద్: వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వరి ధాన్యం, మక్కలు, పత్తిని కొనుగోలు చేసేందుకు అంతా రెడీ చేయాలని సూచించారు. టార్పాలిన్ కవర్లు, తేమశాతం మిషన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్వో నర్సింగరావు, ఏపీడీ వెంకట్, డీఎంవో సురేఖ, […]