అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంద్రా, యానాం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.