అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో […]