సారథి న్యూస్, చేవెళ్ల: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఎంతో శ్రమటోడ్చి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులతో పాటుచేవెళ్ల పోలీసు సిబ్బందికి పెంజర్ల అనంతరెడ్డి మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని సోమవారం చేవెళ్ల సీఐ బాలకృష్ణ ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, నత్తి కృష్ణారెడ్డి, ఆగిరెడ్డి, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, కుంచం నవీన్, శ్రీకాంత్ రెడ్డి, కనక మామిడి రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.