సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్వీ క్యాలెండర్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం కొంపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్ గౌడ్, నరేష్, లింగం రాజ్, మల్లేష్, దుర్గగౌడ్, శ్రవణ్ గౌడ్, ముస్తఫా, సాయికిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.