సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. […]