Breaking News

CHAITU

రామోజీ ఫిల్మ్​సిటీలో చైతూ సినిమా చిత్రీకరణ

ఫిల్మ్​సిటీలో ‘లవ్​స్టోరీ’ షూటింగ్​

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్​స్టోరీ’ చిత్ర షూటింగ్​ రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగనున్నది. ఫిదా తర్వాత చాలా గ్యాప్​ తీసుకొని శేఖర్​కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అగష్టు మొదటివారం నుంచి రామోజీఫిల్మ్​సిటీలో షూటింగ్​ జరుగనున్నట్టు సమాచారం. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నది.

Read More