ఢిల్లీ: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వ్యాపారవర్గాలకు కేంద్రప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. బ్యాంకు ఖాతాల్లో నగదు లేక చెక్‌బౌన్స్ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన తదితర చర్యలను నేరాల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన 19 చట్టాల్లో సవరణలు చేయనున్నది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడం, వ్యాపారవర్గాలకు ఎంతో తోడ్పడుతుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. […]