సారథి న్యూస్, మెదక్: సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్ కు గురై బాలికమృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి బాలమణి, కిష్టయ్య కూతురు స్రవంతి(9) ఉదయం సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. స్రవంతి మృతితో […]