అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. తాజాగా 87మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి దాకా మృతుల సంఖ్య 2,562కు చేరింది. మొత్తం 53,712 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 88,138గా నమోదైంది. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.