సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంప్ రాయవరంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక హతాశులయ్యారు.