ముంబై: టీవీ చానళ్లలో టీఆర్‌పీ కుంభకోణం నేపథ్యంలో బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చి కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా చానళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 12వారాల పాటు (మూడు నెలలు) రేటింగ్‌ను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం టీవీ రేటింగ్ ఇవ్వడానికి గల ప్రమాణాలను సమీక్షించి, రేటింగ్ ప్రక్రియను ఆధునిక సాంకేతికత సాయంతో మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్‌బీఏ) స్వాగతించింది. బార్క్ నిర్ణయం సాహసోపేతమైనదని, […]