వరంగల్‌లో మిన్నంటిన నిరసనలు.. కాకతీయ యూనివర్సిటీలో ఆందోళనలు సారథి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయడం లేదని మనస్తాపం చెంది గతనెల 26న పురుగు మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ శుక్రవారం నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వారం రోజులుగా ప్రాణాలతో పోరాడిన సునీల్ చివరకు మృత్యుఒడికి చేరుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టాడు. పట్టుదలతో చదివి జన్మించాడు. […]