టోక్యో: కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ లేనిది అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించి ‘స్మార్ట్ మాస్కు’ తయారుచేసింది. ఇంటర్నెట్కు, మనం వాడే స్మార్ట్ ఫోన్‌కు ఈ మాస్క్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మాస్కును బ్లూటూత్ ద్వారా మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చని డోనట్ రోబోటిక్స్ సీఈవో తైసుకే ఓనో తెలిపారు. ఈ సీ-మాస్క్ ద్వారా కాల్స్ చేయొచ్చని, మెసేజ్‌లను కూడా పంపించుకోవచ్చన్నారు. జపాన్ భాష […]