సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో భారీఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొన్న సుతారి పల్లి, నిన్న క్యాట్రియల్ గ్రామంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్కో సంచికి 8కిలోల వరకు ఎక్కువ తూకం వేశారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు శివరాములు, పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్, ప్రదానకార్యదర్శి […]