సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కు ఎంపీ పోతుగంటి రాములు కృతజ్ఞతలు తెలిపారు.