సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ భాగ్యనగరంలో మరోసారి భారీవర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోసారి అవకాశాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వారిని జీహెచ్ఎంసీ వారు ఏర్పాటుచేసిన షెల్టర్లను తరలించాలని ఆదేశించారు.