సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన విద్యుత్‌చార్జీలు ప్రజలకు గుదిబండలా మారాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని టీఎస్ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి […]