సారథి న్యూస్, షాద్నగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ వద్ద బెంగళూరు హైవేపై ఆదివారం ఉదయం ఓ కంటెయినర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కన పార్క్ చేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ పొలీసులు ఫైర్ సిబ్బందిని అలర్ట్చేసి మంటలను ఆర్పివేయించారు. బెంగళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబంధించిన ట్యాబ్లెట్ లోడుతో వస్తున్న కంటెయినర్శంషాబాద్ ఘాన్సిమియాగూడ వద్దకు రాగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో […]
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 33 గంటల పాటు లాక్‌డౌన్ విధించారు. శనివారం నుంచి సోమవారం సాయంత్ర 5గంటల వరకు లాక్‌డౌన్ విధించినట్లు పోలీసులు చెప్పారు. బెంగళూరులో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ ప్రారంభం కాగా.. ఈ సారి శనివారం నుంచి సోమవారం వరకు విధించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘లాక్‌డౌన్ 8గంటలకు స్టార్ట్ అవుతుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. రెస్పెక్టెడ్ సిటిజన్స్ […]