నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు సారథి, నర్సాపూర్: ఆకలి ఉన్నంత కాలం వ్యవసాయం అవసరం ఉంటుందని నాబార్డు చైర్మన్ గోవిందరాజులు అన్నారు. గ్రామాల్లో వ్యవసాయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందన్నారు. రూ.లక్షల కోట్లతో నాబార్డ్ సంస్థ వ్యవసాయరంగానికి చేయూతనిస్తుందన్నారు. విద్యార్థులు ఫీల్డ్ లో నేర్చుకున్న వ్యవసాయ సాంకేతికత దేశానికి ఉపయోగపడాలన్నారు. సోమవారం మెదక్జిల్లా నర్సాపూర్ మండలం తునికి గ్రామ శివారులోని విజ్ఞాన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీ 24వ స్నాతకోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి, బెయర్ రూరల్ […]