న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. దీనివల్ల టీమ్‌లో సమతూకం వస్తుందన్నాడు. ‘పాండ్యా అదనపు బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా ఉపయోగపడతాడు. దీనివల్ల భారత్‌కు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అదనపు బౌలర్‌గా పాండ్యా సేవలు చాలాకీలకం. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలంటే మూడో పేసర్‌గా పనికొస్తాడు. అతను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే పంత్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించవచ్చు. […]
న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్‌లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. […]