అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో […]
కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో […]
ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం సిటీ సర్వీసులకు అనుమతి లేదు నగదురహిత టికెట్ లు జారీ సారథి న్యూస్, అనంతపురం, శ్రీకాకుళం: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 58 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో గురువారం ఉదయం ఎట్టకేలకు రోడ్డెక్కాయి. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు రాకపోకలు సాగించాయి. ఆన్‌లైన్ బుకింగ్ కూడా బుధవారం సాయంత్రం నుంచే […]
70 శాతం సర్వీసులు మాత్రమే: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సారథి న్యూస్, విజయవాడ: గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. నెమ్మదిగా సంస్థ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. సిటీ బస్సు సర్వీసులను తర్వాత ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో సమారు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర […]