సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్‌రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్‌రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్‌రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. అనంతరం […]