సారథి న్యూస్, బోయినిపల్లి: బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ పిలుపునిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బడుగు బలహీనవర్గాలకు ఎన్నో హక్కులు కల్పించాలని గుర్తుచేశారు. ఆ మహనీయుడి ఆశయసాధనకు మనమంత పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నారు.