సారథి న్యూస్, రామగుండం: అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళితనేత దివంగత మైసన్న సేవలు మరువలేనివరి దళితసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్లో మైసన్న వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళితసంఘాల నాయకులు పోగుల రంగయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య. దుబాసి బొందయ్య, శంకర్, రామునాయక్, సిద్ధార్థ, శనిగరపు రామస్వామి. లచ్చులు, గంటయ్య, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు చెందిన రాజగృహంపై దాడులు చేయడం అమానుషమని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్ సదన్ మహారాజ్ పేర్కొన్నారు. గురువారం దళితసంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ముంబై నగరంలో ఉన్న అంబేద్కర్ చారిత్రక నివాస గృహంపై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం రాజ్యాంగ విలువలను […]