సారథి న్యూస్, హుస్నాబాద్ : రైతుబంధుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకుడు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలపై నియంత్రణ విధించడంతో రైతుబంధు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో రైతులు తమ భూములకు అనుకూలంగా పలు రకాల పంటలు పండిస్తే ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం తీసుకురావడమే కాకుండా గతంలో […]