సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం బీద, మధ్య తరగతి ప్రజలను దోచుకొని ధనికులకు పంచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలివెన శంకర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరిఖని పట్టణంలో ఓ కారుకు తాళ్లను కట్టి దాన్ని నెట్టుకుంటూ వెళ్లి వినూత్న రీతిలో సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ.. […]