యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ అగర్తలా: భారత్అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి […]