అమెరికా: మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ఆఫ్రికన్ ఆమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన ఘటనపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మినియా పొలిస్‌లో ఆందోళనలు ఐదవ రోజూ కొనసాగాయి. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్, చికాగో, అట్లాంటాలో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ గార్డ్ సోల్జర్స్ చెప్పారు. సియాటెల్ నుంచి న్యూయార్క్ వరకు వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపై ఆందోళనకు దిగారు. లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు ఫైరింగ్ […]