సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]