సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆదివారం ఓ శతాధిక వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుడైన కొండాపురం హన్మిరెడ్డి(103) 1917 లో జన్మించాడు. అయితే ఎప్పుడు చలాకీగా ఉండే హన్మిరెడ్డి తన పని తాను చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. ఈనెల 9న ప్రమాదవశాత్తు కాలు జారిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతిచెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.