Breaking News

TELANGANA

చిట్టచివరి రైతు దాకా ‘రైతుబంధు’

చిట్టచివరి రైతు దాకా ‘రైతుబంధు’

దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం కరోనా కష్టకాలంలోనూ రైతులకు సాయం యాజమాన్య హక్కు సమస్యలను పరిష్కరించాలి నియంత్రిత సాగు.. రైతుల్లో గొప్ప పరివర్తన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో […]

Read More
తెలంగాణలో 1,178 కేసులు,

తెలంగాణలో 1,178 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ ​కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్​ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్​101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్​ 20, కరీంనగర్​24, సిరిసిల్ల […]

Read More

ఏపీలో కులాల కుమ్ములాట

ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు కులప్రాతిపదికననే నడుస్తాయన్నది సుస్పష్టం. గెలుపు ఓటముల్లోనూ కులాల ప్రభావం అధికంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇక అధికారంలోకి వచ్చినవారు తమ సామాజికవర్గం వారిని అందలం ఎక్కించడం.. ఇతర కులస్థులను ముఖ్యంగా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న కులాలకు చెందినవారిపై వివక్ష చూపించడం సర్వసాధారణమే. అయితే రాజ్యాంగ‌బ‌ద్ధమైన ప‌ద‌వుల‌ను ప్రభుత్వాలు గౌర‌వించాలి. వ్యక్తిగ‌త ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగంలో పొందుప‌ర‌చిన మౌలిక అంశం. ప్రజాప్రతినిధులు సైతం ఈ నిబంధనను పాటిస్తామంటూ […]

Read More
న‌యీం.. దూబేల‌ను పోషించిందెవరు?

న‌యీం.. దూబేల‌ను పోషించిందెవరు?

సారథి న్యూస్​, హైదరాబాద్: కాన్పూర్ కు చెందిన గ్యాంగ్‌స్టర్​ వికాస్‌దూబే ఎన్‌కౌంట‌ర్ ఎన్నో ప్రశ్నలు లేవ‌నెత్తింది. 20 -25 ఏళ్ల కాలంలో ఒక హంత‌కుడు గ్యాంగ్‌స్టర్​గా ఎదిగేంత వ‌ర‌కూ అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. చిన్న దొంగ‌త‌నం చేసిన నేర‌స్తుల‌పైనే పీడీ యాక్టులు విధించే ఖాకీలు ఎందుక‌లా వ‌దిలేశాయన్నది ప్రశ్నార్థకమే. అయితే కాన్పూర్​కు చెందిన వికాస్​ దుబే, తెలంగాణకు చెందిన నయీం ఎదిగిన తీరు ఒకేలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో న‌యీం పోలీసుల కోవ‌ర్టుగా చేసిన సాయానికి […]

Read More
వస్త్రవ్యాపారం.. దివాళా

వస్త్రవ్యాపారం.. దివాళా

సారథి న్యూస్, హైదరాబాద్: వస్త్రవ్యాపారంపై కరోనా పంజా విసిరింది. ఆ రంగం మీద ఆధారపడి జీవించే వ్యాపారులు, వర్తకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు లేక హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులు వెలవెలబోతున్నాయి. అరకొరగా వచ్చే వినియోగదారుల నుంచి ఎక్కడ కరోనా అంటుకుందేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎంతటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందోనన్న ఆందోళనతో కొద్ది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్లు ప్రకటించి, వారం తర్వాత మళ్లీ దుకాణాలను […]

Read More
ఒకేరోజు 1,278 కేసులు

ఒకేరోజు 1,278 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 32,224 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 9,076 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్‌ […]

Read More
షార్ట్ న్యూస్

మల్లేశం​ను సత్కరించిన స్వేరోస్​

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్స్​ అసోసియేషన్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జర్నలిస్ట్​ డాక్టర్​ ఎజ్రా మల్లేశంను స్వేరోస్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వేరోస్​ సభ్యులు మాట్లాడుతూ.. మల్లేశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకవాడం సంతోషంగా ఉన్నదని, కరోనా సమయంలో డాక్టర్‌ గా, పాత్రికేయుడుగా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి స్వేరో, జిల్లా […]

Read More

తెలంగాణలో కోవిడ్​ కాల్​సెంటర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రం కోవిడ్​ బాధితుల కోసం ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఈ కాల్​సెంటర్​ ద్వారా కోవిడి పాజిటివ్​ బాధితులు హోం ఐసోలేషన్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించనున్నారు. 18005994455 టోల్​ఫ్రీ నంబర్​కు కాల్​చేసి సూచనలు పొందవచ్చు. వ్యాధి తీవ్రత సాధారణంగా ఉన్నవారికి 17 రోజులపాటు నిపుణులు ఫోన్​లో సూచనలు ఇస్తారు. లక్షణాలు అధికంగా ఉన్నవారికి టెలీ మెడిసిన్​ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తారు. రెండువిడుతల్లో సుమారు 200 మంది ప్రతినిధులు […]

Read More