సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా పాలెం అలువేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. నాలుగు నెలలకు సంబంధించి రూ.3,17,455 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. దేవాదాయశాఖ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్స్పెక్టర్ వీణా సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.ఆంజనేయులు, మాజీ చైర్మన్ నరసింహాస్వామి గుప్తా, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, ఉపసర్పంచ్ చికొండ్ర రాములు, గ్రామపెద్దలు పాలది మల్లికార్జున్, ఎస్ బాలస్వామి, ఆనంద్, జగదీశ్, ఆలయ […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురం పుణ్యక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. హుండీలో రెండు యూఎస్ డాలర్లు, ఐదు యూరోలు లభించాయి. వీటితో పాటు అమ్మవారి ఆలయంలో 62.800 మి.గ్రా. మిశ్రమ బంగారం, 620 మి.గ్రా మిశ్రమ వెండి వచ్చింది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 110మి.గ్రా. మిశ్రమ వెండి, ఒక యూఎస్ డాలర్ వచ్చింది. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.65,463 […]