సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని […]
న్యూఢిల్లీ: ట్రిపుల్ ఒలింపియన్, హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ (96) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడు. బల్బీర్ బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టిందని, ఎంఆర్ఐ స్కానింగ్ లో తేలిందని బల్బీర్ మనవడు కబీర్ తెలిపాడు. ‘కొన్ని రోజులుగా గుండెపోటు రాలేదు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. బల్బీర్ స్పృహలో లేరు. వెంటిలేటర్ సాయంతోనే శ్వాస అందిస్తున్నారు. డాక్టర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు’ అని కబీర్ వెల్లడించాడు.