న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. 1939 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేశ్ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారి స్వగ్రామం చత్తీస్ ఘడ్ కు వెళ్లిపోయారు. అనంతరం కలకత్తాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి లా, కామర్స్ డిగ్రీ చదివారు. ఆర్యసభ పేర రాజకీయ పార్టీని స్థాపించి హర్యానా నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా […]