సామాజిక సారథి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1,820 కిలోల గంజాయి పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన పది టైర్ల లారీ, కారును సీజ్ చేశారు. ఆంధప్రదేశ్ లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని […]