సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఏఎస్సై శారద, జయహో మహిళా అధ్యక్షురాలు జక్కిని శ్రీలత, కానిస్టేబుల్ సుమలత, అంగన్వాడీ టీచర్లు తిరుమల, సరస్వతి, ఆశా వర్కర్ రాధ పాల్గొన్నారు.