న్యూఢిల్లీ: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సుఖాంతం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీని సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య సానుకూల చర్చలు జరిగాయని.. తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి సచిన్, ఆయనవర్గ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారని కాంగ్రెస్పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు […]