సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి, రంగసాయిపల్లి కొక్కరకుంట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను మండల వ్యవసాయాధికారి యాస్మిన్ సోమవారం తనిఖీ చేశారు. షాపుల్లో నిల్వ ఉన్న స్టాక్, విత్తనాల లైసెన్సులు, పీసీ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. రైతులకు డీలర్ల సంతకంతో కూడిన రసీదు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. లైసెన్సు ఉన్న షాపుల్లో మాత్రమే రైతులు ఎరువులు, విత్తనాలు కొనాలని కోరారు.