సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ జార్జ్ హెచ్చరించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో బయటికి వస్తున్న పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలని, 10 గంటల తర్వాత ఎవరైనా బయట […]