Breaking News

సినీనటి

నిత్యానంద దగ్గరికి వెళ్లిపోతా!

చెన్నై: నటి మీరా మిథున్​ నిత్యానందపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన చాలా గొప్పవాడని.. మీడియా అనవసరంగా నిత్యానందపై తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్​ చేశారు. ‘నిత్యానంద చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి అంతా దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే నేను నిత్యానంద సృష్టించిన కైలాసానికి వెళ్లి.. ఆయనను కలుసుకుంటాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం’ అంటూ మీరామిథున్​ నిత్యానందను పొగడ్తల్లో ముంచెత్తింది. కాగా మీరా వ్యాఖ్యలపై నెట్​జన్లు మండిపడుతున్నారు.

Read More
ఐటంగర్ల్​తో దావూద్​ ఎఫైర్​

ఐటంగర్ల్​తో దావూద్​ ఎఫైర్​

కరాచీ: అండర్​ వరల్డ్​ డాన్​, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్​ ఇబ్రహీం పాకిస్థాన్​కు చెందిన ఓ సినీనటితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్​కు చెందిన మెహ్విష్​ హయత్​ (37) మొదట ఐటం గర్ల్​గా కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది. ఆమెతో దావూద్​ సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇండియా నుంచి పారిపోయిన దావూద్​ పాకిస్థాన్​లోని కరాచీలో ఓ భారీ బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. దావూద్​కు పాక్​ చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు, […]

Read More