తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి అరుదైన రికార్డు సాధించింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు అందించే ఆమె ‘జ్యోతక్క’ పేరుతో ఆగస్టు 1వ తేదీన స్టార్ట్ చేసిన యూ ట్యూబ్ చానెల్‌కు అతితక్కువ కాలంలోనే లక్ష మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్ చేసిన వీడియోస్‌ను సుమారు 7.67లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె సబ్స్ర్కైబర్స్కు థ్యాంక్స్ చెప్పింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు న్యూస్ చానెల్ వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. […]
విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ యాస, తనదైన మార్క్హావాభావాలతో వార్తలు చెప్పే బిత్తిరి సత్తికి ‘సాక్షి’ స్ర్కిప్ట్ రెడీ అయింది. త్వరలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సాక్షి’ ప్రోమో వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నా మనస్సాక్షిగా చెబుతున్న బిడ్డా.. ఇది తండ్రిని గౌరవించుకునే జాగా.. నీవు యాడికి పోయేది లేదు. ఇదే నీ అడ్డా.. అర్థమైందా బిడ్డా..’ అని తండ్రి పాత్రధారి సత్తి అనగా.. ఇగ సత్తిగాని సత్తా ఏందో చూపిస్త.. […]
విలక్షణమైన నటన, వస్త్రధారణతో.. తెలంగాణ గ్రామీణ యాసకు తనదైన మార్కుని జోడించిన బిత్తిరి సత్తి తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. మొదట వీ 6 ఛానెల్ లో తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రి అలియాస్ జ్యోతితో చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను పనిచేసిన ఛానల్ లో అభిప్రాయ భేదాలు రావడం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి సత్తి అక్కడ రాజీనామా చేసిన […]