సారథి న్యూస్, కర్నూలు: మానవాళిని వణికిస్తున్న కరోనా విజృంభిస్తున్న సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఘనంగా సత్కరించారు. సోమవారం ఉదయం ఎన్.ఆర్.పేటలోని ఆరవ శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఇద్దరు కార్మికుల చేత కేక్ కట్ చేయించారు. కోవిడ్ నియంత్రణకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకపై ప్రతినెలా చివరి రోజున ఆ నెలలో వచ్చే పారిశుద్ధ్య కార్మికుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని […]