సారథి, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏపీ, తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రాకపోకలను ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. అలంపూర్ ప్రాంతానికి కర్నూలు పట్టణం చేరువలో ఉండటంతో ప్రతి చిన్న పనికి అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ విషయమై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి జోగుళాంబ […]