సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి పంచాయతీ ఉప సర్పంచ్సంతకాన్ని అదే గ్రామ సర్పంచ్ వెంకటయ్య కొడుకు ఫోర్జరీ చేసి రూ.1.44లక్షలు డ్రా చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్తులు, వార్డుసభ్యులు సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేయని పనులకు రికార్డులు సృష్టించి సర్పంచ్ కుమారుడే చెక్కులపై సంతకాలు చేసుకుని ఎస్ టీవో ఆఫీసులో బిల్లులు డ్రా చేశాడని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.