సారథి న్యూస్, హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు3,380 ప్రత్యేక బస్సులను, ఏపీకి 1,600 బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. […]