టోక్యో: ఇప్పటికే ఏడాది వాయిదాపడిన టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా కంట్రోల్ చేయకపోతే గేమ్స్ ను నిర్వహించడం సాధ్యం కాదని ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో జపాన్ ప్రైమినిస్టర్ షింజో అబే కూడా ఏకీభవించారు. పూర్తిస్థాయిలో వైరస్ ను కట్టడి చేయకపోతే వచ్చే ఏడాది కూడా గేమ్స్ ను హోస్ట్ చేయడం అసాధ్యమని తేల్చిపారేశారు. ‘అథ్లెట్స్, ప్రేక్షకుల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే ఒలింపిక్స్ ను నిర్వహిస్తాం. […]