సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం మండల అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పలు వార్డుల్లో కలియ తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్థానికులు పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ జీవన్, ఎంపీడీవో మల్హోత్రా, ఎంపీవో సతీష్, కార్యదర్శి శ్రీకాంత్ రావు, ఎంపీటీసీ సభ్యుడు మోడీ రవి, ఏఎన్ఎం, వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.