సారథి న్యూస్, ఎల్బీనగర్: కొంతకాలంగా బకాయిలో ఉన్న జీతాలను వెంటనే చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలని శ్రీచైతన్య కాలేజీ ఎదుట అధ్యాపకులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురిలో శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్లో క్లాస్రూమ్లోకి వెళ్లి అధ్యాపకులు స్వీయనిర్బంధం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని బాధిత లెక్చరర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాలు […]